మహాకూటమిలో సీట్ల సర్దు బాటు అటుంచి..అసలు సీటే రాదనుకున్న కొందరు ఇతర పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ జన సమితి నేత, టీఎన్‌జీవో జిల్లా మాజీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి భాజపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించిన రాజేందర్‌రెడ్డికి టికెట్ రాకపోవడంతో కొంత నిరాశకు గురయ్యాకు. దీంతో ఎప్పుడెప్పుగా అంటూ ఎదురు చూస్తున్న రాష్ట్ర భాజపా నేతలు ఆయన్ను ఫోన్‌లో సంప్రదించినట్లు సమాచారం.
ఈ విషయమై కొందరు రాజేందర్ రెడ్డిని ప్రశ్నించగా …మరో రెండు రోజుల్లో రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహబూబ్‌నగర్ స్థానాన్ని తెదేపా నేత ఎర్ర శేఖర్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే తంతు కొనసాగుతోంది… మరో రెండు రోజుల్లో మహాకూటమి నుంచి సీటు ఆశించి భంగ పడ్డవారంతా రెబల్స్ కూటమి పెట్టిన ఆశ్చర్యం లేదు.. అంటూ కొందరూ వ్యగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.