దేవుడా.. తాళి, గాజులు, ఇనుప ముక్కలను మింగేసింది…!

-

ఆక్యుఫాగియా.. అంటే తెలుసా మీకు. అదో అరుదైన వ్యాధి. ఆక్యుఫాగియా వ్యాధి ఉన్నవాళ్లకు మెటల్ లాంటి వస్తువులను తినాలనిపిస్తుందట. అంటే… ఇనుప మేకులు, బంగారం చైన్లు, గాజులు, ఇలా… ఎటువంటి మెటల్ వస్తువులు కనిపించినా.. లటక్కున నోట్లో వేసుకోవాలనిపిస్తుందన్నమాట. ఈ వ్యాధి ఓ మహిళకు ఉంది. ఆ మహిళకు ఈ వ్యాధితో పాటు కాస్త మతిస్థిమితం కూడా ఉంది. దీంతో ఆ మహిళ ఎటువంటి మెటల్ వస్తువులు కనిపించినా లటక్కున లాగించేసేది. అలా రోజూ ఇనుప మేకులు, అవీ ఇవీ అన్నీ మింగేసేది. కానీ.. అవి అరగవు కదా. దీంతో ఆమెకు కడుపునొప్పి ప్రారంభమయింది. దీంతో ఆమెను గుజరాత్ లోని అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె కడుపులో ఉన్న వస్తువులను చూసి షాకయ్యారు. వెంటనే ఆపరేషన్ చేసి ఆమె శరీరంలో ఉన్న దాదాపు కిలోన్నర వస్తువులను బయటికి తీశారు. వెంటనే ఆమెకు ఆపరేషన్ చేయడం వల్ల బతికింది.. కానీ.. లేకపోతే కడుపులోని వస్తువుల ప్రభావంతో చనిపోయేది అని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఆ మహిళ కోలుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version