సీఎం ఇంట్లో కరోనా కలకలం.. మొన్న కొడుక్కి, నేడు భార్యకు ?

-

మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే తరువాత, అతని తల్లి మరియు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రేకి కూడా కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది.  ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అలాగే ఆయన భార్య రష్మీ ఠాక్రే మార్చి 11న ప్రభుత్వం నడుపుతున్న జె జె ఆసుపత్రిలో కరోనా వైరస్ కు సంబంధించిన మొదటి డోస్ టీకాను తీసుకున్నారు. “ఆమె కోవిడ్ -19 పరీక్ష సోమవారం రాత్రి పాజిటివ్ అని వచ్చింది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం వర్ష వద్ద ఆమెను క్వారంటైన్ చేశారు” అని ఒక అధికారి తెలిపారు.

coronavirus

వైరల్ ఇన్‌ఫెక్షన్‌ వలన టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలినట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే రెండు రోజుల క్రితం వెల్లడించారు. ఇక మంగళవారం, మహారాష్ట్రలో 28,699 కొత్త COVID-19 కేసులు, 13,165 రికవరీలు మరియు 132 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం, 2,30,641 యాక్టివ్ కేసులు ఉండగా 22,47,495 రికవరీలతో సహా మొత్తం కేసుల సంఖ్య 25,33,026 కు పెరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version