అవిసె గింజ‌ల‌ను తినడం వలన లాభమా.. నష్టమా..!

-

అవిసె గింజ‌ల గురించి ఎవరికీ పెద్దగా తెలిసి ఉండదు. కానీ వాటిని తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ గింజలు ఎన్నో రకాల రుగ్మతలను నివారించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే అవిసె గింజలను రోజువారి ఆహారంగా తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి చూద్దామా.

Flaxseeds

ఈ గింజల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. అవిసె గింజలలో ఒమేగా-3, యాంటి-ఇన్ఫ్లమేటరీ స్వభావాలు ఎక్కవగా ఉంటాయి. అందువల్ల తరచుగా వీటిని తీసుకోవడం వల్ల హృదయ స్పందన సమతుల్యం అవుతుందని అన్నారు. అవిసె గింజల్లోని లిగ్నన్స్ కూడా గుండె ఆరోగ్యానికి ఉపయోగకరమని తెలిపారు.

అంతేకాదు.. కీళ్ల నొప్పులు, వాపులు, ఆర్థరైటిస్ ల నిరోధానికి దోహదం చేస్తాయి. వేయించి పొడిచేసి అవిసె గింజల పొడిని అన్ని ఆహార పదార్ధాలలోనూ కలపవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అవిసె గింజలో అధిక మొత్తంలో ఉన్న ఫైబర్ మీ జీర్ణవ్యవస్థను వృద్ధి చేస్తుంది. అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది

అవిసె గింజలు రక్తంలోని షుగర్ లెవెల్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ గింజలలోని ముసిలేజ్ జీర్ణక్రియను నెమ్మదిపరచి రక్తంలో గ్లూకోజ్ కలవడాన్ని నియంత్రిస్తుంది. అవిసె గింజల్లో ఫ్లాక్స్ సీడ్లో ఫైబర్ అధికంగా ఉండటంతో తరచు తీసుకుంటే మధుమేహం బారిన త్వరగా పడరని చెప్పారు.

ఈ గింజలు చర్మం గ్రంథులు ఉత్పత్తి చేసే ఒక జిడ్డు పదార్ధం సిబం ఉత్పత్తిని నియంత్రిస్తాయి. తద్వారా మొటిమలు రాకుండా అరికడతాయి. ఇక వీటిల్లో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చర్మ ఆరోగ్య, సౌందర్యానికి బాగా దోహదం చేస్తాయి. అవి చర్మాన్ని తేమగా మరియు మృదువుగా చేస్తాయి. ఈ గింజలను తినడం వల్ల అందమైన ఒత్తైన జట్టు సొంతం చేసుకోవచ్చు. గోర్లు బలంగా పెరుగుతాయి.

అవిసె గింజలు హార్మోన్లను నియంత్రించగలదు. రుతు చక్రం మీద ప్రభావం చూపుతుంది. వీటిని తినడం వల్ల స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ లోపం లేకుండా ఉంటుంది. దీనిలోని అల్ఫాలినోలెనిక్ అనే పోషకం కండరాలకు బలాన్ని ఇస్తుంది. అయితే ఈ అవిసె గింజలు తింటే కొంతమందికి దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా షుగర్ పేషేంట్స్ , గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వీటిని తీసుకోక పోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version