నవనీత్ రాణాకు అండర్ వరల్డ్ తో సంబంధాలు… సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

-

మహారాష్ట్రలో ఇప్పుడు హనుమాన్ చాలీసా వివాదం నడుస్తోంది. గతంలో తెలుగులో నటించి, ప్రస్తుతం మహరాష్ట్ర అమరావతి నుంచి ఎంపీగా ఉన్న నవనీత్ కౌర్ రాణా పేరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన ‘ మాతోశ్రీ’ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తాం అని ఛాలెంజ్ విసరడంతో ఒక్కసారిగా ఎంపీ నవనీత్ కౌర్ ఆమె భర్త రవి రాణాలు వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. దీంతో వీరిపై కేసు కూడా నమోదైంది. ముంబైలోని స్థానిక కోర్ట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 

కాగా ఈ వివాదంపై శివసేన, రాణా దంపతుల మధ్య తీవ్ర విమర్శలు ప్రతివిమర్శలు జరుగుతున్నాయి. హనుమాన్ చాలీసా పేరుతో దాదాగిరి చేస్తే చూస్తూ ఊరుకోం అని ఇప్పటికే సీఎం ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్ ఇచ్చారు. తాజా శివసేన కీలక నేత ఎంపీ సంజయ్ రౌత్ కీలక నవనీత్ కౌర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణాలకు అండర్ వరల్డ్ తో సంబంధాలు ఉన్నాయంటూ విమర్శించాడు. ఈ మేరకు జైల్లో చనిపోయిన యూసఫ్ లక్డావాలా నుంచి నవనీత్ రూ. 80 లక్షలు అప్పుగా తీసుకున్నారని ఆరోపించాడు సంజయ్ రౌత్. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన యూసఫ్ కు అండర్ వరల్డ్ డాన్ తో సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version