చాలామంది రోజు టీ-కాఫీ తాగుతూ ఉంటారు కానీ రసాయనాలు లేని సహజంగా శక్తినిచ్చే ఒక అద్భుతమైన హెర్బల్ టీ గురించి మీకు తెలుసా? ఇది రోగనిరోధక శక్తి పెంచడానికి, శరీరాన్ని శుద్ధి చేయడానికి మరియు జీర్ణ క్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ టీ ని వారంలో ఒకసారి తాగిన చాలు మీ శరీరంలోని మార్పులను మీరే గమనించవచ్చు. మరి ఈ శక్తివంతమైన సహజ ‘టి’ ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
మనం తాగే కాఫీ,టీ ఏదైనా తాగాలి అంటే టీ పొడి, కాఫీ పొడి ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుంది.కానీ ఈ నేచురల్ టీ తయారు చేసుకోవడానికి ముఖ్యంగా మన వంటింట్లో లభించే పదార్థాలు సరిపోతాయి దీనికోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. ఈ టీ మన శరీరానికి కొత్త శక్తిని అందించి ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.
కావలసిన పదార్థాలు : రెండు కప్పుల నీరు, ఒక చిన్న అల్లం ముక్క, ఆఫ్ టీ స్పూన్ పసుపు, నాలుగు ఐదు గింజలు నల్ల మిరియాలు, ఆఫ్ టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా తేనె లేదా నిమ్మరసం.

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు పోసి వేడి చేయండి. నీరు మరిగేటప్పుడు అందులో చిన్నగా తురిమిన అల్లం, పసుపు పొడి, నల్ల మిరియాలు జీలకర్ర వేయండి. ఈ మిశ్రమాన్ని చిన్న మంట మీద ఐదు నుంచి ఏడు నిమిషాలు మరిగించండి. నీటి పరిమాణం సగం అయ్యేవరకు మరిగించాలి. తర్వాత ఈ టీ ని వడగట్టండి. ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడు రుచికోసం కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకోవచ్చు.
ప్రయోజనాలు: రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఈ టీ లోని పదార్థాలన్నీ శక్తివంతమైనవి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అల్లం జీలకర్ర తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ టీ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అల్లం మరియు పసుపులో ఉండే గుణాలు శరీరంలో కలిగే నొప్పులను,వాపులను తగ్గిస్తాయి.
ఇక ఈ టీ నీ వారంలో ఒకసారి తాగడం వల్ల శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ టీ తాగితే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.
(గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే)