అనంత్ అంబానీ వివాహానికి మహేష్ బాబు.. వీడియో వైరల్

-

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో శుక్రవారం ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జరుగుతోంది. ఈ వివాహానికి ప్రపంచం నలుమూలల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వస్తున్నారు.

 

తాజాగా అనంత్ వివాహ వేడుకలో పాల్గొనేందుకు మహేశ్ బాబు ముంబైకి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో సతీమణి నమ్రత, కూతురు సితారతో కలిసి సూపర్ స్టార్ కనిపించారు. పొడవైన జుట్టు, గడ్డంతో ఆయన లుక్ అదిరిపోయింది. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఆయనను ఇలాంటి మాస్ లుక్ చూడలేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి చిత్రం కోసమే ఈ మేకోవర్ అంటున్నారు.ఇదిలా ఉంటే… సూపర్ స్టార్ మహేశ్ బాబు తదుపరి చిత్రం దర్శక ధీరుడు రాజమౌళితో చేయనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక, సెట్‍లను పూర్తి చేసే పనిలో రాజమౌళి ఉన్నప్పుట్టు సమాచారం. ఈ సినిమా కోసం తన లుక్‍ను మార్చుకునే పనిలో మహేశ్ బాబు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version