తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వచ్చే పది రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో జూలై 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీడి ప్రభావంతో రాబోయే పది రోజులు తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణతో పాటు ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని.. వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, లాంటి ఉత్తర తెలంగాణ వాతావరణ శాఖ. దక్షిణ తెలంగాణలో మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించింది. హైదరాబాద్ లో మాత్రం ప్రతిరోజు వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు, తూర్పుగోదావరి, బాపట్ల, అంబేద్కర్ కోనసీమ లాంటి జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.