కోట్లు పెట్టి ప్రాపర్టీని సొంతం చేసుకోబోతున్న మహేష్ బాబు.. ఎక్కడ అంటే..?

-

రెండు తెలుగు రాష్ట్రాలలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎనలేని అభిమానులు ఉన్నారు అన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మహేష్ బాబు నటిస్తే ఆ సినిమా హిట్ అనే భావన కూడా ప్రేక్షకులలో బలంగా పాతుకు పోయింది. ఈ క్రమంలోనే మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట ఇలా వరుసగా సినిమాలతో విజయాలు అందుకుంటూ సూపర్ హిట్ గా నిలిచాడు. ఇకపోతే ఈయన సినిమాలతో మంచి లాభాలను సొంతం చేసుకోవడమే కాకుండా పలు రకాలుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వస్తున్నాడు.

ఇకపోతే మహేష్ బాబు తాజాగా యూరప్ లో ఉన్న విషయం తెలిసిందే . వెకేషన్ కోసం ఫ్యామిలీతో సహా అక్కడికి వెళ్లిన ఆయన అమెరికాకు త్వరలోనే వెళ్లనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అక్కడ ఒక ప్రాపర్టీని కూడా కొనుగోలు చేయాలని భావిస్తున్నారట. రెండు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఈయన ఆసక్తి చూపిస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే ఏకంగా 50 కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరీ ఆ ప్రాపర్టీని కొనుగోలు చేస్తున్నారు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఈ వార్త బాగా చక్కర్లు కొడుతున్నా ఇందుకు సంబంధించిన నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇకపోతే మహేష్ బాబు, త్రివిక్రమ్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇకపోతే త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా జూలై లో షూటింగ్ మొదలు కానుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడిగా పూజాహెగ్డే నటిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version