రామ్ చరణ్ సినిమాకు మహేష్ నిర్మాత… ఎలా అంటే…!

-

ఈ మధ్య టాలీవుడ్ మార్కెట్ బాగా పెరగడం తో ఇప్పుడు హీరోలు అందరూ కూడా ఒకరితో మరొకరు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మల్టీ స్టారర్ సినిమాలకు ఈ మధ్య కాలంలో ఆసక్తి పెరిగిపోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఈ క్రేజ్ మరింతగా పెరిగింది అనే చెప్పవచ్చు. ఇప్పుడు ఇదే బాటలో మహేష్ బాబు రామ్ చరణ్ నడుస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

అసలు మేటర్ ఏంటీ అంటే… మహేష్ బాబు తో వంశీ పైడపల్లి సినిమా చెయ్యాల్సి ఉంది. ఈ సినిమా కథను మహేష్ బాబు కి వంశీ వినిపించగా తనకు కథ నచ్చలేదు అని చెప్పడం దానిని తీసుకుని వెళ్లి రామ్ చరణ్ కి వినిపించగా రామ్ చరణ్ కి బాగా నచ్చడం తో ఓకే చెప్పాడని టాక్. దీనితో ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని భావిస్తున్నారు. ఇక్కడ మహేష్ ఒక నిర్ణయం తీసుకున్నారు.

ఈ సినిమాలో తాను హీరో కాకపోయినా రామ్ చరణ్ హీరో అయినా సరే తాను సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తాను అని చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే బాధ్యతను మహేష్ తీసుకోవడంతో ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఈ సినిమాను చేసే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నాడు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version