కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యవహారాన్ని క్రమశిక్షణా కమిటీ చూసుకుంటుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశించామని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నారో తెలుసుకుంటామని వెల్లడించారు మహేష్ కుమార్ గౌడ్.

బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పేర్కొన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కు ఉన్న కమిట్‌మెంట్ ఏ పార్టీకి లేదని… టెక్నికల్ కారణాలు చూపించి బీజేపీ మోకాలు అడ్డుతోందని వెల్లడించారు. బీసీలకు బీజేపీ బద్ధ విరోధి… ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్లు ఇచ్చి తీరాలన్నదే మా ప్రయత్నం అన్నారు మహేష్ కుమార్ గౌడ్.