OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే హరిహరవీరమల్లు సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. మరో చిత్రం ఓజీ సెప్టెంబర్ 25, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే OG మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలవ్వగా.. తాజాగా మరో అప్డేట్ వచ్చింది.

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా నుంచి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె కన్మణిని పాత్రలో అలరించనున్నారు. ‘ఓజీ’ రూపంలో ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని వెండితెరపై చూడబోతున్నామనే హామీని ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలు ఇచ్చాయి. తాజాగా విడుదలైన ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒక పోస్టర్ దయ, బలం, నిశ్శబ్దాన్ని ప్రదర్శిస్తోంది. మరో పోస్టర్ ప్రశాంతత మరియు గృహ వాతావరణాన్ని సూచిస్తుంది.