RS PRAVEEN KUMAR: కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చే కుట్ర చేశారు అని బాంబ్ పేల్చారు BRS నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రాజెక్టు పిల్లర్‌కు పగుళ్లు రావు.. క్రస్ట్ గేట్లకు వస్తే రావొచ్చేమో కానీ.. ఒక ఇంట్లో పిల్లర్లకు పగుళ్లు రావు అని ఆరోపణలు చేశారు. ఉష్ణోగ్రత తేడాతో గోడలకు పగుళ్లు వస్తాయి కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్కటే 20వ నెంబర్ పిల్లర్‌కి క్రాక్ వచ్చిందంటే, కచ్చితంగా బ్లాస్ట్ జరిగిందనే అనుమానాలు ఉన్నాయి అన్నారు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్.

అసలు ఏమాత్రం వరద లేని సమయంలో మేడిగడ్డ బ్యారేజీ ఎలా కుంగిపోయింది.. అది కూడా ఒక్క పిల్లరే ఎలా కుంగిపోతుందని నిలదీశారు. అదే సమయంలో ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో కఖోవ్కా డ్యాంను కంట్రోల్డ్ ఎక్స్‌ప్లోజివ్ పేల్చేస్తే 100 మంది చనిపోయారు… ఉక్రెయిన్ ఏమో రష్యా పేల్చింది అంటే రష్యా ఏమో ఉక్రెయిన్ పేల్చింది అంటున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు కూడా ఎలా పేల్చారో తెలియదని పేర్కొన్నారు. భూపాలపల్లి పోలీసులు అప్పుడు వెంటనే పిల్లర్ల శాంపిల్స్, భూమి శాంపిల్, అక్కడ ఉండే మీటర్ రీడింగ్స్, సిస్మిక్ డేటా, కాల్ డీటెయిల్స్ తీసుకొని ఉండాల్సిందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.