మహేష్.. పూజా హెగ్దే.. మరోసారి రొమాన్స్..!

-

సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట మూవీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమా తర్వాత అసలైతే మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో భారీ సినిమా రావాల్సి ఉంది. అయితే జక్కన్న సినిమా అంటే రెండు మూడేళ్లు డేట్స్ ఇచ్చేయాల్సిందే. అందుకే మహేష్ రాజమౌళి సినిమాకు ముందు మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో మహేష్ మరోసారి త్రివిక్రం శ్రీనివాస్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అతడు, ఖలేజా తర్వాత మహేష్ తో త్రివిక్రం హ్యాట్రిక్ మూవీకి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.

ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తున్న త్రివిక్రం ఆ సినిమా తర్వాత మహేష్ తో మూవీ ఫిక్స్ అని తెలుస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ ఈ మూవీ నిర్మిస్తుందని తెలుస్తుంది. రెండేళ్ల క్రితమే హారిక హాసిని మహేష్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ వదిలారు. అది ఇప్పటికి కుదిరిందని చెప్పొచ్చు. ఈ మూవీలో మహేష్ తో పాటు పూజా హెగ్దే హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మహేష్, పూజా హెగ్దే ఆల్రెడీ మహర్షి సినిమాలో నటించారు. ఈ ఇయర్ ఎండింగ్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version