స్పీచ్ టైమ్ లో మహేశ్ కి ఫాన్స్ సూపర్ సర్ప్రైజ్ ..

-

ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఇది కూడా నాలుగు సినిమాలు సంక్రాంతికి కానుకగా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఇక ఈ సంక్రాంతి సందర్భంగా సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో, ఎంత మంచివాడవురా, దర్బార్ సినిమాలు ఆరు రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కాగా వాటిలో మన తెలుగు ప్రేక్షకుల్లో ఒకింత ఎక్కువగా దృష్టి మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమాల మీదనే ఉందని చెప్పాలి. ముందుగా ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో మంచి ఊపు మీదున్న మహేష్ బాబు, వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడితో సరిలేరు సినిమా చేస్తుండడంతో తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అయి తీరుతుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ గట్టిగా నమ్మకాలు పెట్టుకున్నారు.

సరిలేరు నీకేవ్వరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ విషయానికి వస్తే LB స్టేడియం లో అట్టహాసం గా మహేశ్ బాబు బృందం ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసింది. వచ్చిన ప్రేక్షకులు చక్కగా కూర్చునే విధంగా అంతా ఏర్పాటు చేశారు .. ప్రతీ ఒక్క అభిమానీ బయట ఉండాల్సిన అవసరం కూడా లేకుండా అందరికీ ఏర్పాట్లు పర్ఫెక్ట్ గా కుదిరాయి.

అయితే మహేశ్ బాబు స్పీచ్ కి ముందు మహేశ్ ఫాన్స్ ఒక సూపర్ ప్లాన్ వేశారు .. మహేశ్ మాట్లాడే టైమ్ లో స్టేడియం మొత్తం కూడా తమ ఫోన్ లలో ఉన్న ఫ్లాష్ లైట్ లు ఆన్ చేసి మహేశ్ కి సపోర్ట్ ఇవ్వాలి అని ప్లాన్ చేశారు .. మహేశ్ మాట్లాడుతూ ఉన్నంత సేపూ సైలెంట్ గా ఉంటూ వాటిని అటూ ఇటూ ఊపుతూ తమ ఫేవరెట్ హీరో కి ఆహ్లాదం కలిగించే ప్లాన్ వేశారు .. ఈవెంట్ ప్లాన్ చేసినవారు కూడా ఫాన్స్ ఐడియా కి ఫిదా అయిపోయారు !!

Read more RELATED
Recommended to you

Exit mobile version