అద్దె చెల్లించలేదని.. మహేశ్వరం ప్రభుత్వ వైద్య కాలేజీకి తాళం

-

అద్దె చెల్లించలేదని రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కాలేజీకి భారత్ కాలేజ్ యాజమాన్యం తాళం వేసింది. అద్దె చెల్లించకపోవడంతో కాలేజీ బోర్డును భారత్ కాలేజీ యాజమాన్యం తొలగించినట్లు సమాచారం.

అయితే, మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాల కు కేటాయించాల్సిన భవనం.. సరైనా వసతులులేక ఇబ్బందులకు గురవుతున్నామని అధ్యాపకులు చెబుతున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల అద్దెను కాలేజ్ ఇవ్వకపోవడం వల్లనే కళాశాలకు తాళం వేశామని భారత్ కాలేజ్ యాజమాన్యం చెబుతోంది. ఇదిలాఉండగా, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.వచ్చే అకాడమిక్ ఇయర్ లోపు ప్రభుత్వ వైద్య కాలేజీకి కొత్త భవనం, మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news