రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే పట్టణాల్లో నివసించే ప్రజలంతా తమ సొంతూర్లకు చేరుకున్నారు. తమ కుటుంబాలతో కలిసి సంతోషంగా పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు మకర సంక్రాంతి పండుగ సందర్బంగా రెండు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం స్పందించారు. ‘మన తెలుగు సోదర, సోదరీమణులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.భోగి, సంక్రాంతి, కనుమ వంటి గొప్ప పండగల సంప్రదాయాలను గౌరవిస్తూ, మనం కొత్త జీవితం వైపు ఉత్సాహంతో అడుగులు వేస్తున్నాం. మనకు మంచి ఆరోగ్యం మరియు సుఖసంతోషాలను ప్రసాదించాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
మన తెలుగు సోదర, సోదరీమణులందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
భోగి, సంక్రాంతి, కనుమ వంటి గొప్ప పండగల సంప్రదాయాలను గౌరవిస్తూ, మనం కొత్త జీవితం వైపు ఉత్సాహంతో అడుగులు వేస్తున్నాం. మనకు మంచి ఆరోగ్యం మరియు సుఖసంతోషాలను ప్రసాదించాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను.
Wishing a very happy… pic.twitter.com/Q2xheW0Vhy
— Amit Shah (@AmitShah) January 14, 2025