‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ…వెంకీ మామ బొమ్మ అదుర్స్‌ !

-

హీరో వెంక‌టేష్‌, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబోలో ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ సినిమాలో ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా చేశారు. ఇక ఈ సినిమా ఇవాళ రిలీజ్‌ పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. మరి ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

sankranti ki vasthunam

క‌థ‌:ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన రాజు (వెంకటేష్), భాగ్యలక్ష్మి (ఐశ్వర్య రాజేష్)లది హ్యాపీ ఫ్యామిలీ. గోదారిగట్టుపైనా రామచిలకవే అని భాగ్యాన్ని తెగ విపరీతంగా ప్రేమించేస్తుంటాడు రాజు. ఓ హ్యపీ మూమెంట్‌లో తన ఫస్ట్ లవ్ స్టోరీని భార్యతో మొత్తం చెప్తాడు. అక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న టైంలో ట్రైనీగా వచ్చిన మీనా (మీనాక్షిచౌదరి)తో సాగించిన ప్రేమకథను పిన్ టూ పిన్ భాగ్యంతో చెప్తాడు. ఓ కేసులో తప్పు చేయని కారణంగా సస్పెషన్‌కి గురైన రాజు.. హైప్రొఫైల్ కిడ్నాప్ కేసుని ఛేందించే బాధ్యతను తీసుకుంటాడు. పోలీసులకు సైతం అంతుచిక్కని సవాల్‌గా మారిన ఈ క్రైమ్ అండ్ కిడ్నాప్ కేసుని రాజు మాత్రమే ఛేదించగలడని నమ్మి.. అతని సస్పెన్షన్‌ను ఎత్తి వేసి నేరస్థులను పట్టుకునే బాధ్యతను ఆయనపై పెడతారు. దానికోసమే మాజీ ప్రియురాలు (మీనాక్షి చౌదరి)తో కలిసి ఒక అడ్వెంచర్ జర్నీకి వెళ్తాడు. ఈ ప్రయాణంలో భార్య భాగ్య లక్ష్మి (ఐశ్వర్య రాజేష్) కూడా యాడ్ అవుతుంది. ఈ కేసులో వీరికి ఎదురయ్యే కామెడీ, ఎమోషన్స్, థ్రిల్లులతో కూడిన కథే ఈ సినిమా.

Sankranthiki Vasthunam Movie review

న‌టీన‌టుల ప్రదర్శన

రాజు పాత్రలో వెంకటేష్ చించేశాడు. భార్యని తాను ఎంత గా ప్రేమిస్తున్నానో చెప్తూనే కిడ్నాప్ కేసుని సాల్వ్ చేస్తాడు. ఇక భాగ్యలక్ష్మి పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించలేదు..జీవించేసింది. అంతేకాదు తన భర్త ఎక్కడ మాజీ ప్రియురాలి ప్రేమలో పడిపోతాడో అన్న భయంతో ఐశ్వర్యరాజేష్ చూపించే అతి ప్రేమ.. వినయం ..అనుమానం అన్నీ కూడా తెర పై బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక మీనాక్షి చౌదరి ఎప్పుడు కూడా తన కేసు పై కాన్సన్ట్రేషన్ చేసే పద్ధతి హైలెట్గా మారింది . ఈ సినిమాలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా వాళ్ల పాత్రలకి తగిన న్యాయం చేశారు. ఓవరాల్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి ఛాయిస్. కాకపోతే కొన్ని ఇరిటేషన్ తెప్పించే సన్నివేశాలు కూడా భరించాలి. వెంకటేష్ అభిమానులు మరియు కామెడీ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

పాజిటివ్‌ పాయింట్స్‌ :

కామెడీ
కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు
పాటలు
లోఖేషన్స్

నెగిటివ్‌ పాయింట్స్‌:

రొటీన్ కథ
ప్రిడిక్టబుల్‌ సీన్స్‌
కథ కొత్తగా చూపించలేకపోవడం
సినిమా నిడివి

రేటింగ్‌: 3 / 5

Read more RELATED
Recommended to you

Latest news