శబరి గిరుల్లో మకరజ్యోతి దర్శనం..

-

కేరళలోని శబరిమలలో మకరజ్యోతి దర్శనంతో శబరి గిరులు స్వామియే శరణం అయ్యప్ప అనే నామ స్మరణతో మార్మోగాయి. జ్యోతిని కన్నులారా చూసేందుకు భక్తులు లక్షల సంఖ్యలో పోటెత్తారు. పంబానది, సన్నిధానం, హిల్‌టాప్‌, తదితర ప్రాంతాల వద్ద మకర జ్యోతి దర్శనం కోసం ట్రావెన్‌కోర్‌ దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్వామివారి తిరువాభరణాలను సాయంత్రం 6గంటలకు సన్నిధానానికి తరలించి..6.30గంటలకు దీపారాధనతో తిరువాభరణ ఘట్టాన్ని పూర్తి చేశారు. అనంతరం కొద్ది సేపటి క్రితమే పొన్నాంబలమేడు నుంచి అయ్యప్ప జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వంతో పులకించి పోయారు.

భక్తులు ఈనెల 19వరకు అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వీలు కల్పించారు. ఈనెల 20న పందళ రాజవంశీకులు స్వామివారి దర్శనం తర్వాత ఆలయం మూసివేస్తారు. అన్ని వయస్కుల మహిళలను శబరి మల ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీం తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version