షర్మిళ ఫిర్యాదుపై ప్రత్యేక బృందం…

-

సినీ హీరో ప్రభాస్‌తో తనకు సంబంధం ఉందంటూ కొంతమంది సోషల్‌ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం పై నేడు వైఎస్ షర్మిళ హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీపీ ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. అడిషినల్ డీసీపీ రఘువీర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదు సందర్భంగా వైఎస్ షర్మిళ  మీడియాతో మాట్లాడుతూ.. తన పిల్లల మీద ప్రమాణం చేసి ఈ విషయాన్ని చెబుతున్నానని..తనపై ఆరోపణలు చేస్తున్నవారు, చేయిస్తున్నవారు తనలా ప్రమాణం చేయగలారా ఆమె ప్రశ్నించారు. తన భర్త,  పిల్లలు, కుటుంబసభ్యులందరినీ ఈ దుష్ప్రచారం తీవ్రంగా బాధించిందని అన్నారు. ఈ కేసుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ పోలీసులు త్వరలోనే విచారణ పూర్తి చేస్తామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version