ఏపీలో వైసీపీ తో పొత్తు పెట్టుకోండి..కాంగ్రెస్ కి పీకే సూచన

-

కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధిష్టానానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఊహించని ప్రతిపాదన చేశారు.దేశంలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరాలి అంటే కొన్ని మార్పులు అవసరమని సూచించారు.రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా..?వచ్చే ఎన్నికల నాటికి సరికొత్త పొత్తులు ఏర్పడనున్నాయా..?ఎన్నికలు ఏవైనా ఒంటరిగానే పోటీ చేస్తాం అంటున్నా ” వైసిపి” త్వరలో మరో పార్టీతో జతకట్టబోతుందా..?ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ కొత్త పొత్తుకు నాంది పలక బోతున్నాడా..?పొత్తుల విషయంలో వైసీపీ వైఖరి ఎలా ఉన్నా..దేశంలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరాలి అంటే కొన్ని మార్పులు అవసరమని పీకే సూచించారు.

ఈ మేరకు ఆయన కాంగ్రెస్ నేతలకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోని అంశాలు కొన్ని బయటకు వచ్చాయి.అందులో భాగంగా పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తోంది.ఏపీలో దాదాపు కనుమరుగైన పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ తో జత కట్టాలని పీకే సూచించినట్లు సమాచారం.దేశంలో 168 ఎంపీ స్థానాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి బరిలోకి దిగితే మంచి ఫలితాలు ఉంటాయని ఆయన కాంగ్రెస్ కి సూచించారట.ఈ విషయంలో వైసీపీ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version