F3 Movie: ‘ఊ .. ఆ .. ఆహా ఆహా’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. దుమ్ము లేచిపోయిందిగా

-

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. 2019 సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజ్ వ్యవహరిస్తున్నారు.ఎఫ్2 సినిమా భారీ విజయాన్ని సాధించడంతో.. ఎఫ్ 3 మూవీ ని తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక సినిమా లో… కూడా హీరోయిన్లుగా తమన్నా మరియు మెహరీన్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయి….విడుదలకు రెడీగా ఉంది. అయితే.. ఈ నేపథ్యంలోనే ఎఫ్ 3 మూవీ నుంచి అదిరిపోయే సాంగ్ రిలీజ్ అయింది. నీ కోర మీసం చేస్తూ ఉంటే… నువ్వట్టా తిప్పే స్తుంటే… ఉ ఆ ఆహా ఆహా అంటూ సాగే హాట్ సాంగ్ ఆకట్టుకుంటోంది. తమన్నా, మెహరీన్ గ్లామర్, స్పైసి డాన్స్ తో అదరగొట్టాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మే 27వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version