సుఖేష్ చంద్రశేఖర్ కు బిగ్ షాక్..26 లగ్జరీ కార్లను వేలం వేసేందుకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్

-

మనీలాండరింగ్ కేసులో పట్టుబడి జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ కు ఢిల్లీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కేసులో సుఖేశ్ కు సంబంధించిన 26 కార్లను వేలం వేసేందుకు.. ఈడీ అధికారులకు ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మాజీ రెలిగేర్ ప్రమోటర్ మల్వీందర్ సింగ్ భార్యను మోసం చేసిన కేసులో ఈడీ సుకేష్ చంద్రశేఖర్‌ను ఫిబ్రవరి 16న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతన్ని కోర్టులో హాజరు పర్చగా మనీలాండరింగ్ కు పాల్పడినట్లు నేరం రుజువైంది. దీంతో అతను అప్పటి నుంచి జైలు జీవితం గడుపుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ స్కాం వెలుగులోకి రావడంలో కూడా ఇతను కీలక పాత్ర పోషించాడు.

నేర కార్యకలాపాల ద్వారా ప్రతి సుకేశ్‌ చంద్రశేఖర్‌ రూ.వందల కోట్లు సంపాదించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆయనకు చెందిన లగ్జరీ కార్లను విక్రయించేందుకు ఈడీ అనుమతి కోరగా ట్రయల్‌ కోర్టు గతంలో అనుమతించగా దీనిని సవాలు చేస్తూ సుకేశ్‌ భార్య లీలా పాలోస్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం.. వాహనాల భద్రత, జీవనకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిని విక్రయించడమే ఉత్తమమని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version