ఇదేం మేకప్ రా బాబు..పిచ్చి మాములుగా లేదుగా..

-

మేకప్ అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం..అందంగా కనిపించాలని ఏదొక ప్రయత్నం చేస్తున్నారు.కొందరు మేకప్ తో మ్యాజిక్ చేస్తారు. అందం కోసం మాత్రమే కాదు అద్భుతాలను సృష్టించడం కోసం కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. మేకప్ తో ఎన్నో క్రియేట్ చేస్తున్నారు..మేకప్ గురించి పూర్తిగా తెలిసిన అమ్మాయిలు తమ ప్రతిభను ప్రపంచానికి తెలియజేసే సరైన వేదిక లభించక చాలా మంది మరుగున పడిపోతుంటారు..మనకు మంచి టాలెంట్ ఉండి కూడా గుర్తింపునకు నోచుకోని వారు ఎంతో మంది. అయితే ఇదంతా ఒకప్పటి మాట కానీ ఇప్పుడు రోజులు మారాయి..

ప్రపంచంలో ఏదైనా కొత్తగా జరిగితే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది.ప్రపంచంలోనే ఏ మూలన ఉన్నా సరే ఒక చిన్న వీడియో చేసి నెట్టింట పోస్ట్‌ చేస్తే సరి. క్షణాల్లో వీడియో ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఇలా సామాజిక మాధ్యమాల్లో రోజుకో కొత్త వీడియో వైరల్‌ అవుతోంది. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఓ ప్రొఫిషనల్ మేకప్‌ ఆర్టిస్ట్ ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోందీ వీడియో. ఈ వీడియో ప్లే అయ్యే కంటే ముందు ఉన్న ఫొటో చూడగానే ఓ యువతి తల బద్దలై మెదడు బయటకు కనిపిస్తున్న భావన నలుగుతుంది. తల పైభాగంలోని ఒక ముక్కను స్పూన్‌తో తీస్తున్నట్లు కనిపిస్తుంది. మొదట చూడగానే అది ఒక స్కెచ్‌లా కనిపిస్తుంది. అయితే ఓ చిన్న వీడియో క్లిప్‌ వల్ల దీని వెనకాల ఉన్న అసలు విషయం తెలుస్తుంది. అది స్కెచ్‌ కాదని, మేకప్‌ మాయజాలమని. అచ్చంగా తల పగిలిన భావన కలిగించేలా మేకప్‌ వేసిన తీరు ఆశ్చర్యానికి గురి చేయకమానదు. ప్రస్తుతం ఈ మేకప్‌ మాయజాలానికి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..అతని టాలెంట్ కి యావత్ ప్రపంచం ఫిదా అవుతుంది.నెవ్వర్ సీన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇలాంటి ఆలోచన రావడం గ్రేట్ అంటూ ప్రశంసలు అందుకున్నాడు… మీరు ఆ మేకప్ మ్యాజిక్ పోస్ట్ ను ఒకసారి చూడండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version