Malaika Arora: బాలీవుడ్ నటి మలైకా అరోరా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ముంబైలోని బాంద్రాలో భవనం టెర్రస్‌పై నుంచి బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వెంటనే పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటివరకు ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని ఈ సందర్భంగా వెల్లడించారు పోలీసులు. దీంతో మలైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తన సంతాపాన్ని తెలియజేయడానికి నటి నివాసానికి చేరుకున్నారు.
ఇక బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్యకు గల కారణాలను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.