మలక్‌పేట్ శిరీష హత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. శిరీష భర్త వినయ్, సోదరి సరిత కలిసి హత్య చేసినట్టు గుర్తించారు. సరిత అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు శిరీషను హత్య చేసారు. 6 నెలల క్రితం అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సరిత.. కొన్ని నెలలుగా అక్రమ సంబంధం కొనసాగితున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ అక్రమ సంబంధంతో కుటుంబ పరువుపోతుందని మందలించింది శిరీష.
ఈ విషయంలోనే ఈనెల 2న సరిత, శిరీష మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే నిద్ర పోవడానికి కొన్ని రోజులుగా మత్తు ఇంజక్షన్ లు వాడుతున్న శిరీషకు సారీ చెప్పి.. ఆమె నిద్రపోయేందుకు ఇంజక్షన్ ఇచ్చింది సరిత. రాత్రి మత్తులోకి జారిపోయిన శిరీషకు.. ఓవర్‌డోస్ ఇచ్చి నిద్రలోనే శిరీష చనిపోయేలా చేసింది సరిత. మరుసటిరోజు శిరీషను లేపేందుకు ప్రయత్నించినట్టు సరిత డ్రామా చేసింది. శిరీష లేవడం లేదంటూ ఆస్పత్రికి తీసుకెళ్లిన సరిత.. శిరీష గుండెపోటుతో చనిపోయిందని డాక్టర్లతో చెప్పించింది. ఆయా తర్వాత మృతదేహాన్ని హుటాహుటిన దోమలపెంటకు తరలించారు సరిత, వినయ్. శిరీష మేనమామ ఎంటర్‌కావడంతో ఈ హత్యా ఉదంతం బయటకు వచ్చింది. దోమలపెంట నుంచి మృతదేహాన్ని రప్పించి పోస్టుమార్టం జరిపించాడు మేనమామ. ఇక శిరీషది హత్యగా పోస్టుమార్టంలో బయటపడటంతో సరిత, వినయ్ ని అరెస్ట్ చేసారు పోలీసులు.