కరీంనగర్-మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నేటితో మూడో రోజు. అయితే, మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థికి లీడ్ రాగా.. నిర్దేశించిన ఓట్లు రాకపోవడంతో ఫలితం నిర్దారణ కాలేదు.ఈ క్రమంలోనే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు.
ఓట్ల లెక్కింపుతో పాటు ఎలిమినేషన్ ప్రక్రియ సైతం కొనసాగుతుంది.కరీంనగర్ పట్టభద్రుల ఎన్నిక కౌంటింగ్ రెండవ ప్రాధాన్యత ఓట్లలో కూడా బీజేపీ,కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి సమానంగా ఓట్లు వస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారనేది తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. నేటి రాత్రి వరకు ఫలితం తేలనుందని అధికారిక వర్గాల సమాచారం.