Bheemla Nayak: భీమ్లా నాయ‌క్ క్రేజీ అప్డేట్.. రానా జ‌త‌గా మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ.. ఆ హీరోయిన్‌ ఎవ‌రంటే?

-

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ద‌గ్గుపాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న క్రేజీ మ‌ల్టీ సార్ట‌ర్ ‘భీమ్లా నాయక్’. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

మలయాళంలో సూపర్ డూప‌ర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ గా తెర‌కెక్కుతుంది.
ఈ క్రేజీ మూవీకి త్రివిక్రమ్ స్క్రీన్‌ ప్లై , డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన
టీజర్స్ కి అనూష్య స్పంద‌న వ‌చ్చింది. ఈ నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు వెండి తెర మీదికి వ‌స్తుంద‌ని ప్రేక్ష‌కులు వేచి చూస్తున్నారు. కాగా.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.

అయితే.. ఈ చిత్రంలో పవన్ స‌ర‌స‌న మలయాళ టాలెంటెడ్ బ్యూటీ నిత్యామీనన్ నటిస్తున్నట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. ఈ విషయాన్ని నిత్య మీన‌న్ త‌న ట్విట్టర్ హ్యాండిలో స్వయంగా ప్రకటించింది. ఇక, రానాకు స‌ర‌స‌న ఎవ‌రు న‌టిస్తారు అనే దానిపై స‌స్పెన్స్ నెల‌కొని ఉంది. రానా భార్య పాత్రలో కనిపించాల్సిన ఐశ్వర్య రాజేష్ సినిమా నుంచి తప్పుకుందని, ఆమె పాత్రలో వేరే హీరోయిన్ నటిస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నారు. డానియ‌ల్ శేఖ‌ర్ భార్య పాత్ర‌లో తాను న‌టిస్తున్న‌ని క్లారిటీ ఇచ్చింది మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీన‌న్.

భీమ్లా నాయక్ సినిమాలో రానా దగ్గుబాటి(డేనియల్ శేఖర్)తో జత కట్టి, లీడర్, పవన్ కళ్యాణ్ సర్‌తో స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో అందమైన డెబ్యూ. ఈ సంక్రాంతి ఘనంగా జరగబోతోంది” అంటూ పోస్ట్ చేసింది సంయుక్త మీన‌న్‌. డేనియల్ శేఖర్ అనే రానా పాత్రకి భార్య, ఇద్దరు పిల్లలు, తండ్రి ఉంటారు. రానా తండ్రిగా సముద్ర ఖని నటిస్తున్నట్టు టాక్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version