ఈ “కేరళ కుట్టి”…టాలెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే…!!!

-

ప్రతీ మనిషిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది, ఆ ప్రతిభను గుర్తించి,దానికై కృషి చేసినవారు మాత్రమే ఉన్నత శిఖరాలను చూడగలరు. పట్టుదలతో వారు చేసే సాధనే, వారిని  విజయం చెంతకు చేరుస్తుంది. వారు పడ్డ శ్రమ వారికి గుర్తింపు తీసుకువస్తుంది. కళ ఏదైనా సరే గుర్తుంపు తీసుకువచ్చే మార్గం మాత్రం ఇదే. అన్ని కళలలోను వేరే వారి గొంతును అనుకరించటం మాత్రం కచ్చితంగా ప్రత్యేకమైనదే అని చెప్పచ్చు. సాధారణంగా ఈ మిమిక్రీ రంగం లో మగవారు అనుకరించటం ఎక్కువగా చూస్తుంటాం. కాని కళలకు స్త్రీ, పురుష వ్యత్యాసం లేదని నిరూపిస్తూ ఒక అమ్మాయి తన మిమిక్రీ తో ప్రజలను ఆశ్చర్యపరిచింది.

కేరళకు చెందిన అఖిల తన ప్రతిభతో అందరిని అబ్బురపరుస్తోంది. ఈమె వయసు 20 ఏళ్ళు. చిన్నతనం నుండి అన్నిటిలోనూ ఉత్సాహాన్ని కనబరిచే అఖిల, తన ఆసక్తిని మిమిక్రీ వైపుకు మళ్ళించింది. చిన్నప్పుడు పక్షుల కిలకిలరావాలు వింటూ ఆనందించే తను, వాటిని అనుకరించటం మొదలుపెట్టింది. అఖిల మిమిక్రీ సాధనను మొదట  ఇంట్లో వారి గొంతులను, ఇంకా క్లాస్ మేట్స్ ను, స్కూల్ టీచర్స్ ను అనుకరిస్తూ చేసేది. అంతే కాదు “ఈ నగరానికి ఏమైంది.. ఒకవైపు దుమ్ము….ఒకవైపు పొగ” అంటూ వచ్చే యాంటీ స్మోక్ యాడ్ లో ఉండే మేల్ వాయిస్ ను అచ్చుగుద్దినట్టుగా దింపేస్తుంది.

ఇక సేలేబ్రేటీల విషయానికి వస్తే ఎస్.జానకమ్మను మొదటిగా అనుకరించేదట. ఓ మలయాళ ఛానల్ లోని ఓ  ప్రోగ్రాంలో ఈ కేరళ కుట్టీ ప్రదర్శనకి ఆడియన్స్ నుంచి చప్పట్లు, ఈలలు, ఆగకుండా వినిపించాయి. నాలుగు నిమిషాల పాటు చేసిన తన మిమిక్రీ లో ప్రతీ నాలుగు సెకన్లకు ఆడ, మగ  గొంతులు మార్చుతూ పెర్ఫార్మెన్స్ ఇరగదీసింది. అలా నాలుగు నిమిషాలలో యాభై ఒక్క మంది సెలెబ్రేటీలను అనుకరించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతోంది. టీవీని ఎక్కువగా చూడటం వలనే సాధన రోజు రోజుకు మెరుగుపడుతోదని చెప్పింది. అఖిల ప్రస్తుతం ఆయుర్వేద వైద్య విద్యను చదువుతోంది, ఈ ఏడాదితో తన చదువు పూర్తవుతుంది..

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news