BREAKING : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత నెలకొంది. మహేందర్ రెడ్డికి ఇవాళ ఉదయం ఛాతీ నొప్పి వచ్చింది. దీంతో మహేందర్ రెడ్డిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
నిన్నటి నుంచి ఐటీ దాడులు చేస్తున్న నేపథ్యంలో.. టెన్షన్ కు గురైన మహేందర్ రెడ్డికి.. ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేందర్ రెడ్డికి.. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.