రైతుల తలరాత మార్చేది.. మల్లన్న సాగర్ ప్రాజెక్టే.- హరీష్ రావు

-

హూజూరాబాద్ ఎన్నికల్లో గత కొన్ని నెలలుగా బిజీగా ఉన్న హరీష్ రావు, తెలంగాణ అభివ్రుద్ధి ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెట్టారు. తాజాగా సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ను సందర్శించారు. రైతుల తలరాతను మార్చే ప్రాజెక్ట్ గా మల్లన్న సాగర్ ను అభివర్ణించారు. తలతరాలకు ఉపయోగపడే గొప్ప ప్రాజెక్ట్ మల్లన్న సాగర్ అని.. తక్కువ సమయంలోనే గొప్ప పని మన కళ్ల ముందు సాక్ష్యాత్కరించిదని ఆయన అన్నారు. సిద్ధిపేట జిల్లా తొగుల మండలం మల్లన్న సాగర్ను శుక్రవారం మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా సందర్శించారు. సీఎం కేసీఆర్ కృషి తోనే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం అయ్యిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

ఈమేరకు ఎన్ని టీఎంసీల నీళ్లు ప్రాజెక్ట్ లోకి చేరాయని, ఎంత ఎత్తు ఉన్నాయనే వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 11 టీఎంసీల నీరు మల్లన్న సాగర్ లోకి చేరాయని, 30 మీటర్ల ఎత్తు వరకు నీరు చేరిందని, బండ్ మొత్తం 22 కిలోమీటర్లు ఉండగా.. ప్రస్తుతం 20 కిలోమీటర్ల వరకు నీరు చేరిందని ఇరిగేషన్ అధికారులు మంత్రికి వివరించారు. అక్కడి ప్రజాప్రతినిధులతో మల్లన్న సాగర్ నిర్మాణపు అనుభవనాలు గుర్తు చేసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version