మొత్తానికి తెలంగాణలో ఒక ఘట్టం ముగిసింది..గత ఐదు నెలలపై నుంచి ఉత్కంఠకు గురించేస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఇక ఈయన విజయాన్ని అడ్డుకోవడానికి టీఆర్ఎస్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో అందరికీ తెలిసిందే. సరే ఎలాంటి ప్రయత్నాలు చేసిన హుజూరాబాద్ ప్రజలు..ఈటలకు అండగా నిలబడ్డారు. ఇక ఫలితం వచ్చేసింది కాబట్టి, ఇక్కడ నుంచి రాజకీయం పూర్తిగా మారనుంది.
అంటే హుజూరాబాద్ ఉపఎన్నిక ముందు..ఉపఎన్నిక తర్వాత అన్నట్లుగా పరిస్తితి మారుతుంది. ఇక నుంచి ఈటల రాజకీయంగా ఎలాంటి స్టెప్ వేస్తారు…అటు కేసీఆర్ ఏ విధంగా ముందుకెళ్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. మధ్యలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయం ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తి కలిగించనుంది. అయితే ఇంతకాలం…కేసీఆర్-ఈటల పక్కపక్కనే ఉన్నారు…ఇద్దరు కలిసికట్టుగా పనిచేశారు.
కానీ ఇప్పుడు ప్రత్యర్ధులు మాదిరిగా పనిచేయనున్నారు. రాజకీయంగా ఈ ఇద్దరు ఎలా ముందుకెళ్తారు…ఒకరినొకరు ఏ విధంగా చెక్ పెట్టుకోవడానికి చూస్తారనేది చూడాలి. అయితే వీరికి మళ్ళీ ఒకరినొకరు ఎదురుపడే సీన్లు చాలా తక్కువ ఉంటాయి. కానీ ఒక్క అసెంబ్లీలో మాత్రమే ఎదురుపడే ఛాన్స్ ఉంది. అంటే నెక్స్ట్ ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగితే అప్పుడు…ఈ ఇద్దరు నేతలు తలపడక తప్పదు. అప్పుడు కేసీఆర్ రాజకీయం ఎలా ఉంటుంది…ఈటల ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.
ఇప్పటికే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళం విప్పుతానని ఈటల చెబుతున్నారు. అలాగే బీజేపీ తరుపున రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ టీఆర్ఎస్‌కు ధీటుగా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేయనున్నారని తెలుస్తోంది. హుజూరాబాద్‌లో తనని ఓడించడానికి తిరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల నియోజకవర్గాల్లో వారిని ఓడించడానికి పనిచేస్తానని ఈటల చెబుతున్నారు. అంటే రానున్న రోజుల్లో ఈటల…మరింతగా కేసీఆర్‌కు తలనొప్పిగా మారనున్నారని తెలుస్తోంది. అలాగే ట్రిపుల్ ‘ఆర్’లు కేసీఆర్‌ని ఆడుకుంటారని బీజేపీ శ్రేణులు మాట్లాడుతున్నాయి. ట్రిపుల్ ఆర్ అంటే…రాజాసింగ్, రఘునందన్ రావు, రాజేందర్‌లు. మరి చూడాలి ఈటల గేమ్ ఎలా ఉంటుందో?