సతీమణిలో కలిసి మల్లారెడ్డి మాస్ డ్యాన్స్ (వీడియో)

-

మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీమంత్రి చామకూర మల్లారెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇటీవల హోలీ పండుగ వేడుకల్లో తన ముఖ్య అనుచరులతో కలిసి మాస్ డ్యాన్స్ వేయడంతో పాటు కుటుంబ సభ్యులు, కేడర్‌తో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. డప్పు చప్పుళ్లకు మాస్ స్టెప్పులేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

తాజాగా తన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మల్లారెడ్డి మరోసారి మీడియా ముఖంగా తెగ ఎంజాయ్ చేశారు. తన సతీమణితో కలిసి ఈసారి స్టెప్పులు వేశారు. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి తెగ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news