హోలీ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో కులమతాలకతీతంగా ప్రజలంతా ఒక్క చోట చేరి రంగులు పూసుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.చిన్న పిల్లలు, పెద్దలు కూడా వయస్సుతో సంబంధం లేకుండా పండగ మూడ్ లోకి వెళ్లిపోయారు.
ఈ క్రమంలోనే హోలీ వేడుకల్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం తన అనుచర గణంతో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఒంటి నిండా రంగులు పూసుకుని వారితో జాలీగా గడిపారు. అంతేకాకుండా తన సపోర్టర్స్, గులాబీ పార్టీ కేడర్‌తో కలిసి హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో గల తన నివాసం వద్ద హోలీ సందర్భంగా మాస్ డాన్స్ చేస్తూ అలరించారు. తన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
https://twitter.com/TeluguScribe/status/1900441336873984014