రాష్ట్రాల ఇన్చార్జీలు జవాబుదారితనంతో వ్యవహరించాలి : మల్లికార్జున ఖర్గే

-

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జ్ ల సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీలో చేరే వారి విషయంలో తొందరపాటు వద్దు. కాంగ్రెస్ భావజాలం ఉన్న వాళ్ళను చేర్చుకోవాలి.. తొందరపడి చేర్చుకున్న వాళ్ళు, కష్ట సమయంలో పారిపోతారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి , ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలబడ్డ వ్యక్తులను ప్రోత్సహించాలి. రాబోయే 5 సంవత్సరాలు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాలి.

ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడం మన ప్రయత్నం. ప్రజలకు మరింత చేరువ కావాలి. బూత్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇన్చార్జిలదే. ఇన్చార్జీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి, కష్టపడి పని చేయాలి. పార్టీ బలోపేతంలో కాంగ్రెస్ అనుబంధ విభాగాల ను భాగస్వామ్యం చేయాలి, కార్మిక విభాగాలను కూడా కలుపుకు పోవాలి. రాష్ట్రాల ఇన్చార్జీలు జవాబుదారితనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఇన్చార్జిల ఆధ్వర్యంలోనే రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితులు, భవిష్యత్తు , ఎన్నికల ఫలితాలకు జవాబుదారితనంగా ఉండాలి అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news