మానసిక స్థితి సరిగ్గా లేక జగన్ మాట్లాడుతున్నట్టు ఉంది. పచ్చి అబద్ధాలు జగన్ మాట్లాడుతున్నాడు అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 70 శాతం మందికి జీవనాధారం అయిన శాఖలను జగన్ నిర్లక్ష్యం చేశారు.జగన్ హయం లోఒక్క సేంట్ భూమికి అయినా సాయిల్ టెస్ట్ జరిగిందా.. రాయలసీమ జిల్లాలో ఎక్కువ మంది డ్రిప్ ఇరిగేషన్ పై ఆధారపడి ఉంటారు. జగన్ ఏదైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు.
మేము అధికారం లోకి వచ్చాక ధాన్యం కొన్న రెండు గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. కృష్ణా జిల్లాలో వరదలు వస్తే అన్యుమరేషన్ చేసి రైతు లకు డబ్బులు ఇచ్చాము. గుంటూరు మిర్చి యార్డ్ ఇప్పుడే పుట్టిందా.. గుంటూరు మిర్చి యార్డ్ చరిత్ర తెలుసుకోవాలి. మిర్చి రైతులు ఇబ్బందుల్లో ఉన్నాడు. ప్రభుత్వం దృష్టి లో మిర్చి రైతుల సమస్యలు ఉన్నాయి. ఊక దంపుడు ఉపన్యాసం జగన్ ఇచ్చారు. మార్కెట్ లో ధర తక్కువ ఉంటే మద్దతు ధర ప్రభుత్వం ప్రకటిస్తుంది. జగన్ హయం లో 7 వేలు మద్దతు ధర ఇచ్చారు. అప్పటికే మార్కెట్ లో 12 వేలు ఉంది. ఇప్పుడు పని లేని జగన్ మిర్చి యార్డ్ కు వెళ్లి విమర్శలు చేస్తూన్నారు అని మంత్రి పేర్కొన్నారు.