మమత ఆహ్వానం… కేసీఆర్ వెళ్తారా…?

-

పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ దూకుడు వివాదాస్పదం అయింది. ముగ్గురు ఐపిఎస్ అధికారుల బదిలీపై కేంద్ర ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఇక ఇదిలా ఉంటే వచ్చే నెలలో పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ బిజెపి ప్రత్యర్ధులను ఆహ్వానించారు. బెంగాల్ రాజధానిలో భారీ బహిరంగ సభతో పాటుగా ఎన్నికల ర్యాలీని ఆమె నిర్వహిస్తున్నారు.

ర్యాలీకి ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, ఎంకె స్టాలిన్, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, ఇతర ప్రాంతీయ నాయకులను ఆమె ఆహ్వానించారు. బిజెపి చీఫ్ జెపి నడ్డా కాన్వాయ్‌పై ఇటీవల జరిగిన దాడిపై నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మమతా బెనర్జీ ప్రభుత్వంపై దూకుడు పెంచారు. ఇక అక్కడి నుంచి కూడా బిజెపి నేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ పర్యటనలలో ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనే ఆందోళన ఉంది.

అయితే మమతా బెనర్జీ సిఎం కేసీఆర్ ని కూడా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల సిఎం కేసీఆర్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి ఆయన వెళ్తారా లేదా అనేది చూడాలి. అయితే సిఎం కేసీఆర్ కేంద్రంతో రాజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version