హీరో రామ్ పోతినేని ఇంట్లో సందడి చేసిన స్టార్ డైరెక్టర్స్ .. వాళ్లెవరో తెల్స…!

-

టాలివుడ్ యంగ్ డైరెక్టర్లు అంత ఒకే చోట చేరారు .అది కూడా ఎనర్జిటిక్ హీరో రామ్ ఇంట్లో .తాజాగా ఇంట్లో ఒక చిన్న పార్టీ జరిగింది . గెట్ టుగెదర్ గా మాదిరిగా జరిగిన ఈ పార్టీ కి యూవ దర్శకులను ఆహ్వానించాడు రామ్ . ఈ సందర్బంగా వారు అందరూ కల్సి విందు చేసుకున్నారు . అంతరం వాళ్ళు ఫొటోలకు స్టిల్స్ ఇచ్చారు .

హీరో రామ్ తో పాటు డైరెక్టర్లు కిషోర్ తిరుమల , గోపిచంద్ మలినేని , అనిల్ రవి పూడి , సంతోష్ శ్రీనివాస్ , వెంకీ కుడుముల అక్కడ పార్టీ లో పాల్గొన్నారు . వీరిలో డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ రామ్ నటించిన రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు . గోపిచంద్ మలినేని ఒక చిత్రం లో రామ్ ను డైరెక్ట్ చేశారు . ఇక అనిల్ రవి పూడి రామ్ నటించిన 3 సినిమాలకు రచయితగా పని చేశారు .

కాగా రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వం లో తెరకెక్కిన రెడ్ అనే సినిమా తొందరలో రిలీజ్ కాబోతుంది . వీరిద్దరి కంబోలో వస్తున్న మూడవ చిత్రం ఇది . నేను శైలజ .వున్నది ఒకటే జిందగీ చేశారు వీళ్ళఇద్దరు .ప్రస్తుతం వీళ్ళ కంబో లో రెడ్ అనే చిత్రం రిలీజ్ అవబోతుంది . వెంకీ కుడుములకుఁ హీరో రామ్ తో సన్నీ హిత సంభంధం ఉంది . ఈ విధంగా యువ డైరెక్టర్లు అందరూ ఒకే వేదికగా చేరి సందడి చేశారు .చాలా రోజుల తర్వాత యంగ్ డైరెక్టర్లు అంత ఒకే చోట చేరి తమ సినిమాలకి సంబంధించిన విషయాలను ఒకరికొకరు షేర్ చేసుకున్నారు .దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారింది . ఫాన్స్ తం ఫేవరేట్ హీరో మరియు డైరెక్టర్లు ను ఒకేదగ్గర చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు .

Read more RELATED
Recommended to you

Exit mobile version