నోబెల్ విజేత అమర్త్యసేన్ ఆరోపణలపై స్పందించిన మమతా బెనర్జీ

-

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నోబెల్ విజేత, ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్ భూకబ్జా ఆరోపణల పై స్పదించారు.స్పందించారు.అమర్త్యసేన్ ఎదుర్కొంటున్న సమస్య పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతుగా నిలిచారు. అసలు విషయంలోకి వెళ్లితే … అమర్త్యసేన్ తమ భూమిని ఆక్రమించారంటూ విశ్వభారతి యూనివర్సిటీ ఆరోపిస్తోంది. ఆ భూమిని తిరిగి ఇచ్చేయాలంటూ వర్సిటీ యాజమాన్యం అమర్త్యసేన్ కు లేఖ రాసింది.

ఈ నేపథ్యంలో, బిర్భూమ్ లోని పూర్వీకుల ఇంట్లో ఉన్న అమర్త్యసేన్ ను మమతా బెనర్జీ కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అమర్త్యసేన్ వంటి వ్యక్తిని బీజేపీ ఈ విధంగా అవమానించడం సరికాదని హితవు పలికారు. “అమర్త్యసేన్ ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాషాయీకరణ పోకడలకు పోకుండా, విశ్వభారతి యాజమాన్యం సరైన పంథాలో నడవాలని కోరుకుంటున్నాను” అని మమతా బెనర్జీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version