రాష్ట్రంలో 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం బంకురాలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మాట్లాడుతూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తనను అరెస్టు చేయడానికి భారతీయ జనతా పార్టీ (బిజెపి) ధైర్యం చేసింది అని… తాను జైలులో ఉన్నా కూడా తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసారు. బిజెపికి ధైర్యం ఉంటే, నన్ను అరెస్టు చేయనివ్వండి అని సవాల్ చేసారు.
జైలులో ఉండే నేను ఎన్నికల్లో విజయాన్ని శాసిస్తా అన్నారు మమత. బిజెపి దేశానికి అతిపెద్ద శాపం అని ఆమె ఆరోపించారు. 294 మంది సభ్యుల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు ఏప్రిల్-మేలో జరగనున్నాయి. టిఎంసి 2011 నుంచి అధికారంలో ఉంది. టిఎంసి ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించడం ద్వారా బిజెపి తమను వేటాడేందుకు ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు.