గత కొన్ని రోజులుగా చూస్తుంటే ఏపీలో ప్రజలు భావ స్వేచ్ఛకు దూరం అవుతున్నారా అని అనిపిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి విరుద్ధంగా తమ విశ్లేషణను వ్రాసినా, తమ వ్యక్తిగత అభిప్రాయం తెలియజేసిన వారిపై కేసులు మోపుతున్నారు. కేవలం వారికి ఏం అనిపిస్తుందో చెబితే చాలు సైబర్ క్రైమ్ అంటూ అరెస్టులు చేస్తున్నారు. వృద్ధులను యువతను ఎవ్వరినీ లెక్కచేయడం లేదు. ప్రభుత్వానికి విరుద్ధంగా ఏదైనా వ్రాసినా, పోస్టులను ఫార్ వర్డ్ చేసినా అరెస్టులు చేస్తున్నారు. దీంతో ప్రజల భావ స్వేచ్ఛ దెబ్బతినే పరిస్థితి నెలకొంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును ఫార్వార్డ్ చేసిన వ్యక్తిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన వట్టికూటి నరసింహారావు (66) అనే వృద్ధుడు స్థానికంగా ఉంటున్నాడు. ఫేస్ బుక్ లో తాను ఓ పోస్ట్ చూసి దానిని ఫార్వార్డ్ చేశాడు. అంతే కేసు నమోదయింది సీఐడీ పోలీసులు వచ్చారు అరెస్ట్ చేసి మంగళగిరికి తరలించారు. ఈ ఘటన తెలిసిన వారు ఫేస్ బుక్ లో పోస్టు ఫార్వార్డ్ చేస్తే సీఐడీ పూలీసులు అరెస్ట్ చేశారా అంటూ ఆశ్చర్యపోతున్నారు, విన్నవారు విస్తుపోతున్నారు.
సాయి రెడ్డి పోస్టు ఫార్వార్డ్ చేస్తే సీఐడీ కేసు..! ఏపీ ప్రజలకు భావ స్వేచ్ఛ లేదా..?
-