ఆల్ ఇండియా కాంగ్రెస్ 135 ఏళ్ళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. లక్నోలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధి హాజరైన సమయంలో ఒక వ్యక్తి భద్రతా సిబ్బందిని దాటుకుని ఆమె వద్దకు పరిగెత్తిన ఘటన చోటు చేసుకుంది. సల్మాన్ ఖుర్షీద్ మరియు ఇతర పార్టీ సహచరులతో కలిసి కూర్చున్నప్పుడు అతను ఉన్నట్టుండి ఆమె వద్దకు పరిగెత్తాడు.
న్యూస్ ఏజెన్సీ ANI ట్వీట్ చేసిన ఒక వీడియోలో, 47 ఏళ్ల వ్యక్తి నీలిరంగు తలపాగా ధరించి ఉన్నాడు. వ్యక్తి భద్రతను ఉల్లంఘించి ఆమె వైపు పరుగెత్తాడు. దాన్ని గమించిన భద్రతా సిబ్బంది అక్కడి నుంచి ఆ వ్యక్తిని పంపించడానికి ప్రయత్నాలు చేయగా ప్రియాంక వద్దని వారించి ముందు కంగారు పడినా సరే ఆ తర్వాత ఆ వ్యక్తిని దగ్గరకు తీసుకుని మాట్లాడారు. దీనితో ఒక్కసారిగా అక్కడ అభిమానులు,
ప్రియాంకా జిందా బాద్ అంటూ నినదిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాంధి కుటుంబానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం భద్రత తగ్గించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం జెడ్-ప్లస్‌కు తగ్గించే వరకు ప్రియాంక గాంధీకి ఎలైట్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పిజి) భద్రత కల్పించింది. ప్రస్తుతం ఆమెకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) భద్రత కల్పిస్తున్నారు.
#WATCH Man breaches security of Priyanka Gandhi Vadra at a party event in Lucknow on Congress foundation day, gets to meet her. pic.twitter.com/v4UtwedMF2
— ANI UP (@ANINewsUP) December 28, 2019