“అభిమాని” పుట్టినరోజున  కేక్ కట్ చేసిన “హీరో”….!!

-

అభిమాన హీరో పుట్టిన రోజు అంటే అభిమానులకి పండగే. హీరో పేరు చెప్పి కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకుంటారు. ఇంకొంతమంది హీరో పేరు మీద పూజలు చేయిస్తారు. ఎన్నో రకాల సేవ కార్యక్రమాలు చేస్తారు వారి అభిమాన హీరో పేరు మీద. అంతగా ప్రేమను చూపించే వారి మీద హీరోలకు కూడా అంతే అభిమానం ఉంటుంది.  కలిసినప్పుడు ఒక ఆటోగ్రాఫ్ , ఒక సెల్ఫీ ఇస్తేనే పొంగిపోతారు వారి అభిమానులు. అలాంటిది ఏకంగా తన పుట్టినరోజు తనకి ఇష్టమైన హీరో సెలెబ్రేట్ చేస్తే..? ఇంకా ఆ అభిమాని ఆనందానికి హద్దులు ఉండవేమో కదా.. అసలు అలంటి హీరో ఉంటారా అంటే, ఉంటారనే చెప్పాలి 

విజయ్ సేతుపతి, సైరా మూవీ తో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన పేరు ఇది. తన విభిన్నమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఈయన, యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్సకత్వంలో తెరకెక్కబోతున్న తలపతి 64 సినిమాలో విజయ్ విలన్ పాత్రా పోషిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ  అక్టోబర్ లో మొదలైంది. ఈ మధ్య కాలంలోనే  విజయ్ ఇందులో పాల్గొన్నారు. షూటింగ్‌ సందర్భంగా కర్ణాటకలోని హోటల్‌లో విజయ్‌ ఉంటున్నాడని తెలుసుకున్న అభిమానులు ఆయన్ని చూడటానికి వెళ్లారు.

 

అదే రోజు ఒక అభిమాని పుట్టురోజు కావటం తో, తన చేతుల మీదగా పుట్టురోజు జరుపుకోవాలి అభిమాని కోరాడు. అంతగా ప్రేమించే  తన అభిమాని కోరిక ను      కాదనలేక పోయాడు  తన చేతులతో కేక్ కట్ చేసి ఆ అభిమానికి తినిపించాడు. ఇక ఆ అభిమాని ఆనందానికి అవధులు లేవు. కాగా, 2019 డిసెంబర్ 1 నుంచి 2020 జనవరి 18 వరకు కర్ణాటకలోని శివమోగ్గ జైలులో షూటింగ్ తీయటం కోసం, చిత్ర యూనిట్ సంబంధిత జిల్లా  అధికారుల అనుమతులు తీసుకున్నారు. ఈ మూవీ లో మాళవికా మోహనన్, శంతను భాగ్యరాజ్ తతితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version