భార్యాభర్తలు విడిపోవడం అన్నది సహజమే. ఎన్నేళ్ల పాటు కాపురం చేసిన వారు అయినా సరే విడాకులు తీసుకుని విడిపోతుంటారు. అయితే భర్త నుంచి విడిపోతే అతని నుంచి భరణం, ఆస్తి వస్తాయి. అనేక దేశాల్లో ఈ తరహా చట్టాలు ఉన్నాయి. కానీ కొందరు భర్తలు మాత్రం తమ భార్యలకు డబ్బులు, ఆస్తిని ఇచ్చేందుకు అంగీకరించరు. దీంతో చిత్రమైన పనులు చేస్తుంటారు. సరిగ్గా ఆ వ్యక్తి కూడా ఇలాగే చేశాడు.
యూకేకు చెదిన జాన్ మెక్‌కార్రీ అనే 75 ఏళ్ల వ్యక్తి తన భార్య నుంచి గతంలోనే విడిపోయాడు. అయితే ఇంటిని అమ్మడం ద్వారా వచ్చిన మొత్తం లోంచి తన భార్యకు వాటా ఇవ్వాలి. కానీ అతనికి అలా చేయడం ఇష్టం లేదు. ఇంటిని అమ్మడం నచ్చలేదు. ఆ ఇంటి విలువ సుమారుగా 5.50 లక్షల పౌండ్లు ఉంటుంది. కానీ ఆ మొత్తంలోంచి వాటాను తన భార్యకు ఇవ్వడం అతనికి నచ్చలేదు. దీంతో అతను ఇల్లు మొత్తాన్ని తగలబెట్టేశాడు.
అయితే పోలీసుల విచారణలో అది యాక్సిడెంట్ కాదని, కావాలనే ఇంటిని తగలబెట్టారని నిర్దారణ అయింది. దీంతో జాన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టులో జాన్ నిజం ఒప్పుకున్నాడు. తాను కావాలనే ఆ పని చేశానని తెలిపాడు. ఆ ఇంటిని అమ్మడం ఇష్టం లేదని, తన భార్యకు ఇవ్వడం నచ్చలేదని, అసలు ఆమెతో విడిపోకూడదనే అనుకున్నానని, ఆ రోజు మద్యం మత్తులో ఉన్నందునే అలా చేశానని కోర్టులో తెలిపాడు. అయినప్పటికీ తప్పు తప్పే కనుక న్యాయమూర్తి శిక్ష విధించారు.