ఉగాది పండుగ పర్వదినాన ఆటోలో ఇంటికి వస్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అనుకోకుండా ఆటోకు ఒక్కసారిగా అడవి పంది అడ్డు రావడంతో ఆటో పల్టీలు కొట్టింది.ఈ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సుతార్ పల్లి శివారులో ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా మల్లుపల్లికి చెందిన భాను చందర్(21) హైదరాబాద్‌లో అద్దెకు ఆటో తీసుకొని నడుపుతుంటాడు.ఆటోలో సుతార్ పల్లికి వస్తుండగా మార్గమధ్యలో ఆటోకి అడవి పంది అడ్డు రావడంతో దానిని ఢీకొట్టాడు. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన భాను చందర్ ఘటనా స్థలంలోనే పడి ఉన్నాడు.ఉదయం ఆదివారం రైతులు గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా.. అక్కడికి వచ్చిన అంబులెన్స్ సిబ్బంది భాను చందర్ మృతి చెందినట్లు నిర్దారించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.