గూగుల్ మ్యాప్స్ ని ఫూల్ ని చేసాడు…!

-

గూగుల్ మ్యాప్స్” ఒక పెద్ద నగరంలో కారు నడుపుతూ, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్నార్ల్స్ లేదా అడ్డంకుల గురించి తెలుసుకోవడానికి ఎవరికైనా సరే అమూల్యమైన సాధనం. మన మార్గాలను సరిగ్గా ప్లాన్ చేయడానికి, మనలో చాలా మంది ఎక్కడికి అయినా వెళ్ళే ముందు గూగుల్ మ్యాప్స్‌ను ఆ ప్రాంత తనిఖీ చేస్తూ ఉంటారు. గూగుల్ కూడా వినియోగదారులను ప్రోత్సహిస్తూ ప్రకటనలు చేస్తూ ఆకట్టుకుంటుంది.

అయితే ఒక వ్యక్తి గూగుల్ మ్యాప్స్ ని ఫూల్ చేసాడు. జర్మనీ రాజధానిలో ‘నకిలీ’ ట్రాఫిక్ జామ్‌లను సృష్టించడానికి 99 స్మార్ట్‌ఫోన్‌లు మరియు తన చేతి బండిని ఉపయోగించి బెర్లిన్‌లో ఒక వ్యక్తి ఫూల్ ని చేసాడు. బెర్లిన్ కు చెందిన సైమన్ వెకర్ట్ అనే కళాకారుడు ఈ స్టంట్ ను రికార్డ్ చేసి యుట్యూబ్ లో పోస్ట్ చేసి… అలాగే తన సొంత బ్లాగులో తన ఫలితాలను కూడా క్లుప్తంగా వివరించాడు.

వీడియోలో, బెర్లిన్లోని గూగుల్ కార్యాలయం వెలుపల ఉన్న వీధితో సహా, నగర వీధుల్లో హ్యాండ్ కార్ట్‌లో ఉంచిన 99 స్మార్ట్‌ఫోన్‌లను వెకర్ట్ లాగుతూ ఉంటాడు. హ్యాండ్ కార్ట్ ని నెమ్మదిగా ముందుకి నడుపుతూ 99 ఫోన్‌లను ఉపయోగించడం వల్ల ఖాళీగా ఉన్న వీధిలో వాహనాలు చాలా ఉన్నాయని గూగుల్ మ్యాప్స్ నమ్మింది. ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ డేటాను క్రౌడ్ సోర్స్ చేయడానికి గూగుల్ ఈ పద్ధతిని ఉపయోగిస్తుంది.

కార్లలోని స్మార్ట్‌ఫోన్‌లు గూగుల్‌కు సమాచారాన్ని అందిస్తాయి. అవి ఏ వేగంతో కదులుతున్నాయి మరియు నిర్దిష్ట వీధిలో ఎన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి అనే దాన్ని సేకరిస్తుంది. వేగం తక్కువగా ఉంటే మరియు సంఖ్య ఎక్కువగా ఉంటే, గూగుల్ ఆ వీధి యొక్క భాగాన్ని ఎరుపు లేదా మెరూన్‌గా చూపిస్తుంది, ట్రాఫిక్ జామ్ ఉందని సూచిస్తుంది. గూగుల్ మ్యాప్స్‌లోని వీధులు క్రమంగా ఆకుపచ్చ నుండి మెరూన్‌కు మారుతున్నట్లు వీడియో చూపిస్తుంది.

ఆ వీధుల్లో ట్రాఫిక్ ఎక్కువగా సూచిస్తుంది. గూగుల్ యొక్క నావిగేషన్ సూచనలు వినియోగదారులు వెకర్ట్ వలన తప్పుదోవ పట్టి అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చూపిస్తుంది. అయితే వేకర్ట్ దీనికి సంబంధించిన వివరాలను పంచుకోలేదు. దీన్ని ఎవరైనా కాపీ చేయవచ్చని భావించి వివరాలు బయటపెట్టలేదు. దీనితో గూగుల్ మ్యాప్స్ కూడా ఒక్కసారిగా షాక్ అయింది. అలా అని గూగుల్ మ్యాప్స్ ని నమ్మకుండా ఉండొద్దు. ఇలాంటి కళాకారులు అన్ని అక్కడక్కడా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version