తెలంగాణాలో ఒక వ్యక్తి ఆన్‌లైన్ రమ్మీలో ఏకంగా రూ.70లక్షలు పోగొట్టుకున్నారు. నిజానికి తెలంగాణాలో ఈ ఆన్ లైన్ రమ్మీ మీద నిషేధం ఉంది. దీంతో ఫేక్ జీపీఎస్ ఉపయోగించి రమ్మీ ఆడుతూ లక్షలు పొగొట్టుకున్నాడు అంబర్‌పేట్‌కు వాసి. రూ.70లక్షలు పొగొట్టుకొని అప్పుడు తాపీగా సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అసలు తెలంగాణాలో ఆన్‌లైన్ రమ్మీ నిషేధం ఉండగా, ఎలా ఓపెన్ అయ్యిందంటూ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేయగా ఫేక్ జీపీఎస్‌తో రమ్మీ అడినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు ముందు ఇతని మీద కేసు నమోదు చేశారు.
ఇక పోలీసుల దర్యాప్తులో రెండేళ్ళుగా రెండు ఐడీలతో బాధితుడు ఆన్‌లైన్ రమ్మీ ఆడుతున్నాడని తేలింది. అప్పులు చేసి ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడుతూ వస్తున్నాడని గుర్తించారు. రేపో, మాప్పో లాభాలొస్తాయంటూ అందులో పెట్టుబడులు పెడుతూ ఉన్నదంతా పొగొట్టుకున్నాక పోలీసులను ఆశ్రయించడంతో సదరు సంస్థ మీదా, ఫేక్ ఐపీ పెట్టి ఆడిన ఈ వ్యక్తి మీదా ఇద్దరి మీదా పోలీసులు కేసు నమోదు చేశారు.