శృంగారం కోసం బ‌య‌ట‌కు వెళ్లాలి, అనుమ‌తివ్వండి అంటూ వ్య‌క్తి ఈ-పాస్ కోసం రిక్వెస్ట్‌.. పోలీసుల రియాక్ష‌న్ ఇదీ..!

-

క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో దేశంలో ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను విధించి క‌ఠినంగా అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ద‌క్షిణాది రాష్ట్రాలు అన్నీ లాక్‌డౌన్‌ను విధించినా తెలంగాణ‌లో లాక్‌డౌన్ లేదు. కానీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకుని వెంట‌నే అమ‌లు చేయ‌డం ప్రారంభించారు. ఇక ఇత‌ర ద‌క్షిణాది రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌లు ఇ-పాస్‌లు తీసుకుని అత్య‌వ‌స‌ర ప‌నులు ముగించుకుంటున్నారు.

అయితే కేర‌ళ‌లోని క‌న్నూర్‌కు చెందిన క‌న్నాపురంలోని ఇరిన‌వె ప్రాంత వాసి అక్క‌డి పోలీసుల‌కు ఇ-పాస్ కోసం ద‌ర‌ఖాస్తు చేశాడు. కానీ అందులో శృంగారం కోసం బ‌య‌ట‌కు వెళ్లాల్సి ఉంద‌ని, త‌న‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరాడు. అయితే ఆ రిక్వెస్ట్ తీసుకున్న వెంట‌నే పోలీసులు అత‌ని కోసం గాలించారు. వెంట‌నే అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు.

కానీ ఆ వ్య‌క్తి ఆ రిక్వెస్ట్‌ను పొర‌పాటుగా పెట్టాన‌ని తెలిపాడు. six o clock కు బ‌దులుగా sex అని పెట్టాన‌ని, పొర‌పాటు అయింద‌ని, క్ష‌మించాల‌ని కోరాడు. దీంతో పోలీసులు అత‌ని క్ష‌మాప‌ణ‌ను అంగీక‌రించి అత‌న్ని విడిచిపెట్టారు. ఇంకెప్పుడు అవ‌స‌రం లేకుండా ఇ-పాస్ కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌వద్ద‌ని అత‌నికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇక తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే బీహార్‌లో చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి మొటిమ‌ల కోసం చికిత్స చేయించుకునేందుకు ఇ-పాస్ ఇవ్వాల‌ని కోర‌గా, అత‌ని పాస్ ద‌ర‌ఖాస్తు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అన‌వ‌స‌రపు ప‌నుల‌కు ఇ-పాస్‌ల కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌ద్ద‌ని పోలీసులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version