DAO పరీక్షలో ఓఎంఆర్‌ పత్రాన్నే మింగేసిన అభ్యర్థి

-

టీఎస్​పీఎస్సీ నిర్వహించిన డివిజనల్​ అకౌంట్స్​ ఆఫీసర్​ రాత పరీక్షలో ఓ అభ్యర్థి ఓఎంఆర్​ షీట్​ను మింగి మాల్​ ప్రాక్టీస్​కు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని బోర్గాం(పీ)లోని ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ విషయంపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిర్మల్​ జిల్లాకు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి అబ్దుల్​ ముఖీద్​.. డివిజనల్​ అకౌంట్స్​ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్షాకేంద్రంలో ఇన్విజిలేటర్​ అభ్యర్థులకు ఓఎంఆర్​ షీట్​లను అందజేశారు. పరీక్షకు హాజరుకాని అభ్యర్థులకు కేటాయించిన స్థానాల్లోనూ పత్రాలను ఉంచారు. అప్పటికే పరీక్ష రాస్తున్న ముఖీద్​ తనకు ఇచ్చిన ప్రశ్నలలో చాలా వరకు తప్పులు రాయడంతో.. గైర్హాజరైన అభ్యర్థి ఓఎంఆర్​ పత్రాన్ని ఇన్విజిలేటర్​కు తెలియకుండా దొంగలించాడు. దొంగలించిన ఓఎంఆర్​ పత్రంతో మళ్లీ పరీక్షను రాశాడు.

Video Player is loading.

ఇప్పుడు తన ఓఎంఆర్​ షీట్​ను ఎవరికీ తెలియకుండా అక్కడే ముక్కలు చేసి.. నమిలి మింగేశాడు. పరీక్ష సమయం అయిపోవడంతో ఇన్విజిలేటర్​లు పరీక్ష పత్రాలను తీసుకునే క్రమంలో ఒక ఓఎంఆర్​ షీట్​ కనిపించట్లేదని గుర్తించారు. వెంటనే ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఎగ్జామ్​ హాల్​లోని సీసీ కెమెరాలో రికార్డు అయిన పుటేజినీ పరిశీలించగా అసలు విషయం బయటపడింది. పోలీసులకు సమాచారం అందించగా వారు అభ్యర్థిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తానే ఓఎంఆర్​ షీట్​ను మింగినట్లు ముఖీద్​ ఒప్పుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version