హత్య చేసి ఆ బాడీతో 250 కిమీల ప్రయాణం !

వామ్మో హత్య చేసిన శవంతో  ప్రయాణం చేయడం అంటే మామూలు మనుషులు చేయడం అయితే కుదరదు. కానీ ఏకంగా 250 కిలోమీటర్లు ప్రయాణించిన ఓ లారీ డ్రైవర్ చివరకు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వివరాలోకి వెళ్తే కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ పోతినేని రాజు లారీ డ్రైవర్  లారీలో  కరీంనగర్ నుంచి  ఏపీలోని కాకినాడకు వరి నూకలు  లోడింగ్ చేసిన తర్వాత పట్టా కట్టే విషయంలో క్లీనర్ తో గొడవ పడ్డాడు. తరచుగా తనతో గొడవకు దిగుతున్నాడని ఎన్ని సార్లు చెప్పినా తన మాట వినకుండా లారీ యజమాని డబ్బులు ఇవ్వాలని నా డబ్బులు ఇచ్చేంత వరకు నేను ఏ పని చేయని అంటూ ఘర్షణకు దిగిన క్లీనర్ ని జాకీ రాడ్ తో తలపై కొట్టాడు.

ఆవేశంలో కొట్టగా తల పగిలి రక్తపు మడుగులో పడిపోయాడు క్లీనర్. అయితే క్లీనర్ బ్రతికితే ఎలాగైనా పోలీసులకు చెబుతాడని భయపడిన డ్రైవర్  క్లీనర్ పొట్టలో కత్తితో పొడిచి హతమార్చాడు. గొడవ జరిగి క్లీనర్ ను హతమార్చిన విషయాన్ని లారీ యజమానికి చెప్పగా లారీతో పాటు మృతదేహాన్ని తీసుకొని వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలని సూచించాడు యజమాని. మృతి చెందిన క్లీనర్ ని లారీ క్యాబిన్లో పడుకోబెట్టుకుని 250 కిలోమీటర్లు ప్రయాణించినా తనకు చీకట్లో పోలీస్ స్టేషన్ కల్పించలేదని చివరకు ఉదయం ఖమ్మం దాటిన తర్వాత  కొణిజర్ల  పోలీస్ స్టేషన్ కనిపించడంతో అక్కడికి వెళ్లి లొంగిపోయానని పేర్కొన్నాడు.